కవి, సాహిత్య విమర్శకుడు, రచయిత ఐన శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారు అందించిన అందమైన కవిత..
మరీ అందగత్తేం కాదు
కానీ...
పులుగడిగిన ముత్యంలా ఉంది
ఏమనుకుంటుందోన్న ధ్యాసే లేదు
తదేకంగా చూస్తున్నా!
ముంగిట రంగోలీ దిద్దుతున్నదామె;
మెడ వంపులో వేలాడే చెవి లోలకం...
ముత్యం అంచు మీద చంద్రోదయం!
ఆమె
చాలా అందంగా ఉంది.
- మాకినీడి సూర్య భాస్కర్

Hmm
మొదటి వాక్యం ”మరీ అందగత్తేం కాదు. ” అని..
మరి చివరి వాక్యం ”ఆమె చాలా అందంగా ఉంది” అని.
మధ్యలో గల కొద్ది మాటల్లో అంత అర్ధాన్ని మార్చడం సుసాధ్యం చేసిన ఈ కవిత
”చాలా గొప్పగా ఉంది”
Nice
Very beautiful poem. Expecting more from you
mutyam, evarinee emee pattinchu kokunda chese panilo nimagnamai chese dhyanam, thellani vennelanu prasarinche chandra kiranalu - ivannee swacchathaku nidarshanaale!
anduke, aame maree andagatte kaakapoyina (baahyamga), swacchathato kudukunna aame, ame dharinchina swacchamaina mutyam, aapai swacchamaina chandra kiranalu kaliste mari andamga kaaka ela untundi?!